విద్యార్థులతో చండీ హోమాలు ప్రత్యేక పూజలు...
మల్హర్ , జూలై 19 (చక్రవాణి న్యూస్) :
వారాహి దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు శనివారం మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో సరస్వతి చండీ హోమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేద త్రిపుర పీఠ గురువులు శ్రీ లోకె రాము హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా స్థానిక హైస్కూల్ మరియు ప్రైమరీ స్కూల్‌కు చెందిన సుమారు 200 మంది విద్యార్థులతో ఆయన ప్రత్యేకంగా సరస్వతీ పూజలు చేయించారు. విద్యార్థుల్లో జ్ఞాన సంపద పెరగాలని, చదువుల్లో రాణించాలని ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న విద్యార్థులందరికీ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కలిసి నోట్‌బుక్స్ మరియు పెన్నులను పంపిణీ చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వారాహి మాత స్వాములు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

No comments:
Post a Comment