చక్రవాణి న్యూస్
మంత్రి శ్రీధర్ బాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు
సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ
📍 [మల్హర్
,:జూలై 19(చక్రవాణి న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో కొయ్యూరు గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని 6వ వార్డు పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలో ఈ నిధులతో రోడ్డును నిర్మించనున్నారు. మల్హర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు, కొయ్యూరు గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ ఈ నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, భూమిపూజ చేసి పనులను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబు నిరంతరం కృషి చేస్తున్నారని, కాలనీవాసుల దశాబ్దాల రోడ్డు సమస్యను తీర్చడానికి నిధులు మంజూరు చేసినందుకు మంత్రికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లకావత్ సహేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు ఎడ్ల మధుసూదన్, వేల్పుల సారమ్మ, పంతకాని శశివర్ధన్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లకావత్ రాజేందర్, ఉపాధ్యక్షులు బిస్కుల అశోక్, తోట ప్రశాంత్, తిరుపతి, వేన్నపురెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే హనుమాన్ గుడి కమిటీ అధ్యక్షులు కోమటి లచ్చయ్య, రామస్వామి, రమేష్, చంద్రకళ, శ్రీనివాస్, శరత్ కుమార్, కొండ సమ్మయ్య, సిద్ధిశంకర్, వేల్పుల మహేందర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
#ChakravaniNews
#తాజావార్తలు
ప్రజా పక్షం — అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం... అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం! నిజం వైపు చక్రవాణి.

No comments:
Post a Comment