భూ నిర్వాసితుల ఆర్గనైజింగ్ సెక్రటరీ తాండ్ర మల్లేష్ సర్వే అడ్డగించిన భూ నిర్వాసితులు వితౌట్ పర్మిషన్ సాకులు చెబితే సర్వేను తీవ్రంగా అడ్డుకుంటామన్న నిర్వాసితులు
మల్హర్ , జూలై 18 (చక్రవాణి న్యూస్) : తాడిచర్ల కాపురం ఓసిపి బ్లాక్-1 పరిధిలోని 500 మీటర్ల డేంజర్ జోన్ భూసేకరణ సర్వే శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతుల పేరుతో పాత ఇళ్లను సర్వే బృందాలు పక్కన పెడుతున్నాయన్న సమాచారంతో, భూనిర్వాసితుల సంఘం ఆర్గనైజేషన్ సెక్రటరీ తాండ్ర మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వాసితులు ఎస్పీ కాలనీలో అధికారులను అడ్డుకున్నారు.ఈ సందర్భంగా తాండ్ర మల్లేష్ మాట్లాడుతూ, 17-12-2022 నాటి ప్రిలిమినరి నోటిఫికేషన్ (పి.ఎన్) ప్రకారం, అలాగే టీఎస్ జెన్కో అధికారులు ఇళ్లకు వేసిన నంబర్ల ఆధారంగా ప్రతి ఇంటినీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. కేవలం గ్రామ పంచాయతీ (జీపీ) రికార్డుల సాకుతో, 1986 నుండి నివసిస్తున్న ఇందారపు రాజపోచయ్య వంటి పాత నివాసితుల ఇళ్లను 'వితౌట్ పర్మిషన్' అంటూ పక్కనపెట్టడం దుర్మార్గమన్నారు. లంచాలకు లొంగి నాన్-లోకల్స్‌కు అక్రమ అనుమతులతో లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. అధికారులు పర్మిషన్ ఉన్న ఇళ్లను 1,203 గా జాబితా చేసి, 1063 వితౌట్ పర్మిషన్ పేరుతో సపరేట్ జాబితా తయారు చేసి అందులో కొందరు ఇంటి పన్ను కడుతున్నా 1,063 పాత ఇళ్లను సైతం సర్వే చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాబోయే సోమవారం నుండి జరిగే సర్వేలోనైనా అధికారులు స్పందించి, జెన్కో నంబర్ వేసిన ప్రతి ఇంటిని సర్వే చేయాలని, లేనిపక్షంలో సర్వేను తీవ్రంగా అడ్డుకుంటామని అధికారులను హెచ్చరించారు.
తహశీల్దార్ హామీ:•• భూనిర్వాసితుల ఆందోళనతో స్పందించిన మండల తహశీల్దార్ కె. రవికుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పారు. డేంజర్ జోన్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తామని, తప్పిపోయిన ప్రతి ఇంటి వివరాలను కూడా సేకరిస్తామని హామీ ఇవ్వడంతో నిర్వాసితులు శాంతించారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితులు ఎల్లయ్య, భద్రయ్య, కొమురయ్య, శ్యామ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments