కొయ్యూరు ఎస్ఐ మహేందర్‌ కుమార్‌కు ఘన సన్మానం

మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

మల్హర్, జూలై 10 (చక్రవాణి న్యూస్): కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌ కుమార్ ను పలువురు నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గ్రామీణ వైద్యుల మండల ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎడ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు డాక్టర్ సమ్మయ్య, వార్డు మెంబర్ మెరుగు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు చింతకింది సురేష్ ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై ని శాలువాతో ఘనంగా సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ అందజేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments