జెన్కో పరిహారం రూ. 45 లక్షలు లూటీ! అధికారుల నిర్లక్ష్యమా.. నాయకుల చేతివాటమా?
మల్హర్ , జూలై 30(చక్రవాణి న్యూస్):
తాడిచర్ల గ్రామపంచాయతీకి చెందిన రెండు వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్ల పరిహారం నిధుల చుట్టూ తిరుగుతున్న 15 ఏళ్ల నాటి సస్పెన్స్‌కు మంథని ఆర్డీఓ విచారణతోనైనా తెరపడుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2010–2011 భూసేకరణ సమయంలో కోల్పోయిన ఈ వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్లకు మంజూరైన సుమారు రూ. 45 లక్షల ప్రజాధనం ఎవరి జేబుల్లోకి వెళ్ళిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
ఈ నేపథ్యంలో, ఈ నిధుల లెక్క అసలు తేలుతుందా లేదా అనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
బ్యాంక్ రికార్డులే అసలైన ఆధారాలు
ఈ రూ. 45 లక్షల పరిహారం లెక్క తేలడం చాలా సులభం. జెన్కో (AP GENCO / TG GENCO) సంస్థ నుండి నిధులు విడుదలైనట్లు చూపే ప్రభుత్వ రికార్డులు, చెక్కులు లేదా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లను పరిశీలిస్తే నిధులు ఏ బ్యాంక్ ఖాతాకు వెళ్లాయో స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ ఆ నిధులు తాడిచర్ల గ్రామపంచాయతీ అధికారిక ఖాతాలో జమ కాకపోతే, అవి ఏ ప్రైవేట్ వ్యక్తుల లేదా అధికారుల ఖాతాల్లోకి మళ్లాయో బ్యాంక్ స్టేట్‌మెంట్ల ఆధారంగా ఇట్టే నిగ్గు తేల్చవచ్చు.
అధికారుల చిత్తశుద్ధిపైనే అనుమానాలు
సాంకేతికంగా రికార్డులు అందుబాటులో ఉన్నప్పటికీ, గత 15 ఏళ్లుగా ఏ ఒక్క అధికారి గానీ, ప్రజాప్రతినిధి గానీ ఈ నిధుల గురించి ప్రశ్నించకపోవడం గమనార్హం. ఇప్పుడు సర్పంచ్ బండి స్వామి, ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ ఫిర్యాదుతో ఆర్డీఓ విచారణకు ఆదేశించారు. అయితే, ఈ విచారణ కేవలం కంటితుడుపుగా సాగుతుందా, లేక లోతుగా పరిశోధించి నివేదిక ఇస్తారా అనేదానిపైనే ఈ పరిహారం లెక్క ఆధారపడి ఉంది.
.
•తెరవెనుక కేటుగాళ్లను కాపాడుతున్నది ఎవరు?
లక్షలాది రూపాయల ఊరి ప్రజల సొమ్ము పక్కదారి పట్టడం వెనుక అప్పటి స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారుల సమిష్టి హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద కుంభకోణంపై స్థానిక ఆర్డీఓ స్థాయి విచారణ సరిపోదని, ప్రభుత్వ పెద్దలు స్పందించి ప్రత్యేక విచారణ జరిపితేనే అసలు కేటుగాళ్ల గుట్టు రట్టవుతుందని తాడిచర్ల గ్రామానికి చెందిన ప్రజలు భావిస్తున్నారు.
మంత్రి శ్రీధర్ బాబు జోక్యంతోనే పూర్తి న్యాయం
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తాడిచర్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి నేరుగా జోక్యం చేసుకుని, సమగ్ర విచారణకు ఆదేశిస్తేనే రికార్డులు బయటకు వస్తాయని, అప్పుడే 15 ఏళ్లుగా నలుగుతున్న వాటర్ ట్యాంకుల పరిహారం లెక్క తేలుతుంది తాడిచర్ల ప్రజలు భావిస్తున్నారు. ఏదేమైనా పక్క దారి పట్టిన లక్షల రూపాయల పరిహారం లేక్క తేలుతుందా.. లేదా అనేది సర్వత్ర ఆసక్తిగా మారింది.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:


No comments:
Post a Comment