తిరుమల తిరుపతి కలశానికి ప్రత్యేక పూజలు చేసిన గ్రామస్తులు..
మల్హర్ , జూలై 30 (చక్రవాణి న్యూస్) :
తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారి పూజా కలశం కొయ్యూరు గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు బుధవారం అంగరంగ వైభవంగా పూజలతో ఊరేగింపు నిర్వహించారు. ఇట్టి కలశాన్ని గ్రామ ప్రజలు, ఆడపడుచులు అందరూ ఊరేగింపుగా ఊరేగించి హనుమాన్ టెంపుల్ వద్ద స్థాపించి పూజలు చేశారు. చిరుతల రామాయణం భక్తులు ప్రత్యేక అలంకరణతో ఇట్టి ఊరేగింపును దేవస్థాన చైర్మన్ ఎడ్ల పెద్ద నారాయణ ఇంటి వద్ద నుండి ప్రారంభమై లక్ష్మీ దేవర ఆలయం నుండి కొయ్యూరు అభయాంజనేయ స్వామి ఆలయం వరకు ఊరేగింపు జరిగిన ఈ మహోత్సవంలో స్థానిక సర్పంచ్ కొండ రాజమ్మ తో పాటు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కలశపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని పంట పైరు పండేలా, గ్రామ ప్రజలు ఆయురారోగ్యంగా ఉండేలా తిరుమల తిరుపతి దేవుని ఆశీస్సులు ఉండాలని ఏడుకొండల స్మరణలతో నినాదాలు చేస్తూ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:


0 Comments