Full width home advertisement

Post Page Advertisement [Top]


పొంగిపొర్లుతున్న వాగులు.. తాడిచర్లలో విరిగిపడిన విద్యుత్ స్తంభం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు.

మల్హర్ , జూలై 29(చక్రవాణి న్యూస్): మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలో భారీ వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మేనంపల్లి ఏరియాలో ఒక భారీ చింతచెట్టు ఈదురు గాలికి ఒక్కసారిగా విరిగి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపై కూలిపోయింది. ఈ ధాటికి సిమెంట్ విద్యుత్ స్తంభం పూర్తిగా విరిగి రోడ్డుపై పడిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా తాడిచర్ల ఫీడర్ల పరిధిలోని విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గత నాలుగు గంటలుగా కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది జాప్యం చేయకుండా రంగంలోకి దిగారు. విరిగిపడిన స్తంభాన్ని, చెట్టు కొమ్మలను తొలగించి, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఎట్టకేలకు నాలుగు గంటల శ్రమ అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మండల వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతూనే ఉన్నాయి.


ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]