సాయినామస్మరణతో మార్మోగిన ఎడ్లపల్లి
మల్హర్ , జూలై 29 (చక్రవాణి న్యూస్) :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా సాయి భక్తులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో సాయిబాబా మందిరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సాయి సన్నిధిలో కాకడ హారతి, అభిషేకం, సాయి సచ్చరిత్ర పారాయణం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తులు నిర్వహించారు. సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో దత్తాత్రేయ, విఘ్నేశ్వర, సరస్వతి దేవతలకు విశేష పూజలు చేసి గురుపూజోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఉత్సవమూర్తిని పల్లకీ రథోత్సవాల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో పురవీధుల్లో ఊరేగించారు. భారీ వర్షాల్లోనూ ఎడ్లపల్లి గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణమంతా సాయినామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి షిరిడి సాయి భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:


No comments:
Post a Comment