భారీ వర్షాలకు నిలిచిన బొగ్గు ఉత్పత్తి
తాడిచర్ల ఓసీపీ-1లో స్తంభించిన పనులు
మల్హర్ , జూలై 29 (చక్రవాణి న్యూస్) :
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల జెన్కో ఓపెన్ కాస్ట్-1 (OCP-1) గనిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మైన్ పరిధిలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి.ఈ వర్షాల వల్ల దాదాపు 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు, 2 లక్షల 40 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ (ఓవర్ బర్డెన్) తొలగింపు పనులకు ఆటంకం కలిగిందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కేఎస్ఎన్ మూర్తి మరియు మైన్ మేనేజర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం గనిలో చేరిన నీటిని భారీ మోటార్ల ద్వారా బయటకు పంపుతున్నామని, వర్షం తగ్గిన వెంటనే పనులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని వారు పేర్కొన్నారు
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

