వెల్మలపల్లి పాఠశాలలో ఘనంగా తల్లిదండ్రుల సమావేశం

చక్రవాణి న్యూస్

అధికారుల చొరవతో పాఠశాలకు కొత్త శోభ!
📍 మల్హర్ ,:జూలై 19(చక్రవాణి న్యూస్) :
మండల కేంద్రమైన తాడిచెర్ల పరిధిలోని వెల్మలపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా జరిగింది. గతంలో మూతపడి, శిథిలావస్థకు చేరిన ఈ పాఠశాల ఇటీవల డీఈఓ రవీందర్, ఎంఈఓ లక్ష్మణ్ బాబుల ప్రత్యేక చొరవతో పునఃప్రారంభమై సరికొత్త శోభను సంతరించుకుంది.ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ హెచ్‌ఎం సురేష్ మాట్లాడుతూ, 24 మంది విద్యార్థులతో ప్రారంభమైన బడిలో ప్రస్తుతం 95% హాజరు నమోదు కావడం సంతోషకరమన్నారు. తల్లిదండ్రులు బాధ్యతగా పిల్లలను రోజూ బడికి పంపాలని, ప్రతి నెల మూడో శనివారం మీటింగ్‌కు రావాలని కోరారు. అనంతరం 'శ్రీ సీతారామ సేవా సదన్' సంస్థ సౌజన్యంతో విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీచర్ గంగరాజు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#ChakravaniNews #తాజావార్తలు

ప్రజా పక్షం — అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం... అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం! నిజం వైపు చక్రవాణి.

Post a Comment

0 Comments