Full width home advertisement

Post Page Advertisement [Top]


మండల వ్యవసాయ అధికారిణి బి శ్రీజ

మల్హర్ , జూలై 23 (చక్రవాణి న్యూస్) :ఎల్‌నినో ప్రభావంతో వానకాలంలో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున, రైతులు ఎక్కువ నీరు కావలసిన వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారిణి బొల్లపెల్లి శ్రీజ సూచించారు. వరి, పత్తి, మొక్కజొన్న సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు వేసుకోవాలన్నారు. వాతావరణ సూచనల ప్రకారం శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే పెట్టుబడి ఖర్చు తగ్గి స్థిరమైన ఆదాయం వస్తుందని తెలిపారు. రైతులు క్లస్టర్ ఏఈఓల సలహాలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రతి పంచాయతీలో అవగాహన సదస్సులు పెడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఏఈవో అనూష, రైతులు పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]