విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి: తాడిచర్ల యువత డిమాండ్
ఢిల్లీ జంతర్ మంతర్ దీక్షకు మద్దతుగా మల్హర్ మండలంలో నిరసన ప్రదర్శన
మల్హర్ , జూలై 23 (చక్రవాణి న్యూస్) :
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న విద్యార్థులకు తాడిచెర్ల గ్రామ యువత గురువారం పూర్తి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా గ్రామంలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.యువత మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరగాలని, ‘సేవ్ ఎడ్యుకేషన్-సేవ్ నేషన్’ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇందారపు విష్ణువర్ధన్, కిరణ్, డేవిడ్ రాజు, మహేందర్, కుమార్, కడారి పవన్ కళ్యాణ్, మోతే దీక్షిత్, రొడ్డ ఈశ్వర్, సందేశ్, అన్వేష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
