అమ్మ జ్ఞాపకార్థం.. సర్కారు బడికి అండగా..!

వెలుమలపల్లి పాఠశాలకు రెండు ఫ్యాన్లు బహూకరణ

మల్హర్ , జూలై 23 (చక్రవాణి న్యూస్) : ఇటీవలే పునఃప్రారంభమై విజయవంతంగా నడుస్తున్న తాడిచెర్ల యూపీఎస్ వెలుమలపల్లి ప్రభుత్వ పాఠశాలకు స్థానిక దాతల అండ లభించింది. కీర్తిశేషులు బూడిద వెంకటలక్ష్మి జ్ఞాపకార్థం ఆమె కుమారులు బూడిద ప్రశాంత్, బూడిద ప్రదీప్ సోదరులు వినూత్నంగా ఆలోచించి వారి మాతృమూర్తి జ్ఞఞాపకార్ధంగా బడి పిల్లల చదువుకు ఉపయోగపడేలా రెండు సీలింగ్ ఫ్యాన్లను కొనుగోలు చేసి పాఠశాలకు బహూకరించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు బూడిద సమ్మయ్య పాల్గొని ఫ్యాన్లను అందజేశారు. మాతృమూర్తి గుర్తుగా పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన సోదరులను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బూడిద బానేష్, సతీష్, నాగరాజు, సారయ్య, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments