ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కేసారపు నరేష్
మల్హర్ , జూలై 30(చక్రవాణి న్యూస్) :
మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలో వెంటనే పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కేసారపు నరేష్ మాదిగ డిమాండ్ చేశారు. తాడిచర్ల మైనింగ్ ప్రాంతంలో ఓసిపి బ్లాక్-1తో పాటు తాజాగా బ్లాక్-2ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించడంతో ఇక్కడ పారిశ్రామికంగా జనాభా గణనీయంగా పెరుగుతోందని తెలిపారు.ఇప్పటికే ఇక్కడ తహసీల్దార్, మండల పరిషత్, జూనియర్ కళాశాల, ప్యాక్స్ (PACS) వంటి ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని గుర్తుచేశారు. పోలీస్ స్టేషన్ దూరంగా ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని తాడిచర్లలో పోలీస్ ఔట్ పోస్టును మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

0 Comments