Full width home advertisement

Post Page Advertisement [Top]

తాడిచర్ల మైన్ పేరిట రాజకీయం వద్దు.. మూడు నెలల్లో పనులు ప్రారంభించాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ 

సింగరేణి అధికారులతో కలిసి గని స్థలాన్ని పరిశీలించిన ఎంపీ..

మల్హర్, జూలై 11(చక్రవాణి న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ పరిధిలోని తాడిచర్ల కోల్ బ్లాక్ మైన్-2 ప్రాజెక్టు స్థలాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్ట్ మ్యాప్ ద్వారా గని వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 40 నుండి 50 ఏళ్ల జీవితకాలం ఉండే ఈ ప్రాజెక్టు కోసం 1800 పైచిలుకు హెక్టార్ల భూసేకరణ అవసరమని, ప్రాథమికంగా 290 హెక్టార్ల పట్టా భూమి సేకరించాల్సి ఉందని అధికారులు ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా ప్రభావిత గ్రామాలు, భూములు కోల్పోతున్న బాధితుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ మైన్ ద్వారా రూ.50 వేల కోట్ల టర్నోవర్ పెరుగుతుందని పేర్కొన్నారు.'సింగరేణి బీజేపీ భరోసా' పేరుతో పెద్దపల్లి జిల్లాకు వస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ వంశీకృష్ణ స్వాగతం పలుకుతూ పలు విజ్ఞప్తులు చేశారు. కేంద్రమంత్రి సింగరేణి కార్మికులకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. పర్యావరణ అనుమతులు త్వరగా తీసుకువచ్చి, రాబోయే మూడు నెలల్లోనే ఈ మైన్ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తాడిచర్ల మైన్ నుంచే సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచుతూ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
•స్థానిక యువతకే ప్రాధాన్యత.. భూనిర్వాసితులకు పూర్తి న్యాయం జరగాలి! 
 నూతనంగా ఏర్పాటు చేయబోయే తాడిచర్ల బ్లాక్-2 కోల్ ప్రాజెక్టులో స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. తాడిచర్ల బ్లాక్ గనిని సింగరేణికి కేటాయించేలా పార్లమెంట్‌లో తాము నిరంతరం పోరాడామని గుర్తుచేశారు. దివంగత నేత కాకా వెంకటస్వామి కాలం నుంచి నేటి వరకు తమ కుటుంబం ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసమే పాటుపడుతోందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. తాడిచర్ల మైన్ పేరిట రాజకీయాలు వద్దని హితవు పలికారు. భూనిర్వాసితులందరికీ ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా పూర్తి న్యాయం జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఉన్నతాధికారులు, తహసీల్దార్ కె. రవికుమార్, కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్, భూ నిర్వాసితులు, తాడిచెర్ల గ్రామస్తులు పాల్గొన్నారు.



ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]