Full width home advertisement

Post Page Advertisement [Top]

ప్రత్యామ్నాయ సాగుపైనే రైతాంగం దృష్టి పెట్టాలి ఉద్యాన అధికారి వై.మణి

మల్హర్ , జూలై 21(చక్రవాణి న్యూస్) : జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో రైతులు సాంప్రదాయ పంటల జోలికి వెళ్లకుండా, తక్కువ నీటితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఉద్యాన పంటల సాగు వైపు అడుగులు వేయాలని డివిజన్‌ ఉద్యాన శాఖ అధికారి వై.మణి సూచించారు. మంగళవారం మల్హర్ మండలంలో క్షేత్రస్థాయి పంటలను వారు పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 30 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ఇది ఎల్‌నినో ప్రభావంతో కూడిన కరువు పరిస్థితులను సూచిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో స్వల్పకాలిక, బహిరంగ పరాగసంపర్క (ఓపెన్‌ పోలినేటెడ్‌) రకాలను ఎంచుకోవడం ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. అనుకూలమైన రకాలు: టమోటో: సాహూ, అర్క రక్షక్, పూసా రూబీ (ఓపీ) వంకాయ: మంజరి, ఉత్కర్ష, అర్కా నీలకాంత్ (ఓపీ) బెండ, బీర, కాకర: వీబీహెచ్‌-11, అర్కా అనామిక, అర్క సుమీత్, పూసా విశేష్ రకాలు సాగుకు అనుకూలం. యాజమాన్య పద్ధతులు: నీటి పొదుపు కోసం డ్రిప్, స్ప్రింక్లర్, మల్చింగ్‌ విధానాలను విధిగా పాటించాలి. తోటల్లో ఓపెన్‌ పోలినేటెడ్, హైబ్రిడ్‌ రకాలను 70:30 నిష్పత్తిలో సాగు చేయాలి. వాతావరణ ఒత్తిడిని తట్టుకోవడానికి పంట నాటిన 30 రోజుల తర్వాత లీటరు నీటికి 5-7 గ్రాముల 19:19:19 ఎన్‌పీకే ఎరువు కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. భారీగా సబ్సిడీలు: కూరగాయల సాగు చేపట్టే రైతులకు ఎకరానికి రూ.9,600 చొప్పున ప్రోత్సాహకం ఇస్తామన్నారు. అలాగే మల్చింగ్, పండ్ల తోటల సాగుకు 40 శాతం వరకు సబ్సిడీ లభిస్తుందని, ఆసక్తి గల రైతులు జిల్లా ఉద్యానవన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]