తాడిచెర్ల ఏఎమ్మార్ కోల్ బ్లాక్-01 మైనింగ్ పనులు పరిశీలించిన.. టీజీ జెన్కో డైరెక్టర్ బి.నాగియా

గనిలో బొగ్గు ఉత్పత్తిని పెంచాలి: టీజీజెన్కో డైరెక్టర్ బి.నాగియా

మల్హర్ , జూలై 21 (చక్రవాణి న్యూస్) : భూపాలపల్లి జిల్లా లోని తాడిచర్ల కోల్ బ్లాక్ 01 ఓపెన్ కాస్ట్ మైన్ ను మంగళవారం టీజీజెన్కో కోల్ & లాజిస్టిక్స్ డైరెక్టర్ బి.నాగియా సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన వెంట టీజీజెన్కో జీఎం పి.మోహన్ రావు, కేటీపీపీ సీఈ ఓ&ఎమ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మైన్ సీనియర్ అధికారులు ఏఎమ్మార్ ప్రాజెక్టు హెడ్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కేఎస్ఎన్ మూర్తి గని యొక్క ప్రస్తుత స్థితిగతులు, బొగ్గు మైనింగ్ ప్రక్రియను డైరెక్టర్‌కు డిజిటల్ ప్రెజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా వివరించారు. అనంతరం మైన్ వ్యూ పాయింట్ నుండి గని పనులను పరిశీలించిన డైరెక్టర్ బి.నాగియా, బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు సూచనలు మరియు ఆదేశాలు జారీ చేశారు.


ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments