మల్హర్ బిజెపి ఆధ్వర్యంలో ప్రదాని మోడీ,కిషన్ రెడ్డి, సునీల్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం
మల్హర్ , జూలై 09(చక్రవాణి న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్‌రావు మండలంలోని తాడిచర్ల కోల్ బ్లాక్-2 ని సింగరేణికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బీజేపీ మండల అధ్యక్షుడు బండ శ్రీకాంత్ పటేల్ అన్నారు. ఈ సందర్భంగా మలహర్ రావు మండల కేంద్రంలో బండ శ్రీకాంత్ పటేల్, అసెంబ్లీ కన్వీనర్ మల్కా మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరియు ఈ కేటాయింపు కోసం కృషి చేసిన చంద్రుపట్ల సునీల్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ కోల్ బ్లాక్ ద్వారా తాడిచర్ల, పెద్దతుండ్ల, మల్లారం గ్రామాలకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని శ్రీకాంత్ పటేల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర సమ్మయ్య, ఎస్కే నిషాన్, అంగజాల సంజీవ్, లింగన్నపేట అశోక్, గిట్ల శ్రీనివాస్ రెడ్డి, అజ్మీరా అక్కెరం, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:
Post a Comment