ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, జూలై 8: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, విద్యావ్యవస్థ బలోపేతానికి మరియు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ అధికారులు, ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వారీగా వసతి గృహాలలో సౌకర్యాల కల్పన, మరమ్మతులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. వసతి గృహాలలో చదువుకునే విద్యార్థులకు ప్రతి విషయంలో మనం బాధ్యత వహించాలని తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కాంట్రాక్టు పనులు తీసుకుని, గడువులోగా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న గుత్తేదారులకు (కాంట్రాక్టర్లకు) తక్షణమే నోటీసులు జారీ చేయాలని, స్పందించని వారిని నిబంధనల ప్రకారం బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని సూచించారు. వసతి గృహాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థుల సీట్లు ఖాళీగా ఉండకూడదని, అర్హులైన విద్యార్థులకు ఆయా సీట్లను కేటాయించి వంద శాతం భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అలాగే అన్ని హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల వివరాలపై సమగ్ర నివేదికలు, ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఉండాలని, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. అన్ని వసతి గృహాలు తనిఖీ చేయాలని, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని స్పష్టం చేశారు.సదుపాయాల్లో రాజీ పడేద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. విద్యార్థుల సౌకర్యాల కల్పనలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన భోజన సదుపాయాల కల్పనలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత వార్డెన్లు, ప్రిన్సిపాల్స్‌పై ఉందన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని హెచ్చరించారు. మెనూ అమలు చేయాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, విద్యా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, జిల్లా కో-ఆర్డినేటర్లు, అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, హెడ్‌మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి


0 Comments