మిర్చి రైతులకు ఆధునిక సాగు విధానాలపై శిక్షణ

 

తాడిచెర్ల రైతు వేదికలో సాగు, సస్యరక్షణ, మార్కెటింగ్ పై అవగాహన

మల్హర్, సెప్టెంబర్ 8(చక్రవాణి న్యూస్) :

మిర్చి సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ అధిక దిగుబడితో పాటు మెరుగైన ఆదాయం పొందేలా రైతులు ముందుకు సాగాలని పలువురు నిపుణులు సూచించారు. మిర్చి పంట సాగు విధానాలు, సస్యరక్షణ, ఎగుమతులు, మార్కెటింగ్, ప్రభుత్వ సబ్సిడీలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం తాడిచెర్ల రైతు వేదికలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఎన్ఎస్ఎస్పీ జాతీయ సుగంధ ద్రవ్యాల సుస్థిరత కార్యక్రమంలో భాగంగా పోతన ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్ఎస్ఎస్పీ మాస్టర్ ట్రైనర్ కె. ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆర్థిక స్వావలంబనతో పాటు సామాజిక, పర్యావరణ మార్పులు, జీవ వైవిధ్య పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు.స్పైసెస్ బోర్డు మేనేజర్ రామన్న మిర్చి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే సమయంలో రైతులు ఎదుర్కొనే సమస్యలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. భూపాలపల్లి తెలంగాణ విజ్ఞాన రైతు కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మిర్చి సాగులో పాటించాల్సిన పద్ధతులు, పంటను వివిధ తెగుళ్లు, పురుగుల నుంచి కాపాడుకునే సస్యరక్షణ చర్యలపై సూచనలు అందించారు.ప్రాంతీయ ఉద్యాన అధికారిణి మనీ రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సబ్సిడీలు, పథకాల వివరాలను వెల్లడించారు. మాజీ మండల ఎంపీపీ చింతలపల్లి మలహర్ రావు రైతుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు, వ్యాపార పరంగా ఉన్న అవకాశాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు.కార్యక్రమంలో ఎన్జీవో ఎస్‌ఓ జి. వెంకట్ రెడ్డి వందన సమర్పణ చేయగా, కోఆర్డినేటర్ నాగరాజు సహకరించారు. తాడిచెర్ల పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, సర్పంచ్ బండి స్వామి, పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగంతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.




చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...

అన్యాయాన్ని అంతం చేసే

విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments