Full width home advertisement

Post Page Advertisement [Top]


మంత్రి క్యాంపు కార్యాలయాన్ని రైతులతో కలిసి ముట్టడి

24 గంటల విద్యుత్‌ హామీని అమలు చేయాలని డిమాండ్‌

రైతులకు నాణ్యమైన కరెంటు అందించాలని బీజేపీ నేతల డిమాండ్‌

మంథని సెప్టెంబర్ 12 (చక్రవాణి న్యూస్) :బీజేపీ రాష్ట్ర కమిటీ పార్టీ పిలుపు మేరకు, కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శనివారం మంథని పట్టణంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద రైతులతో కలిసి బీజేపీ నాయకులు మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మంథని పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్‌ రెడ్డి, చల్లా నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రైతు గోస కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 24 గంటల కరెంటు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చి, ఇప్పుడు కేవలం 7 గంటల కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఉందంటే కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అర్థమవుతుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతులు నీళ్ల కోసం ధర్నా చేయడం సిగ్గుచేటని అన్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ మంత్రి శ్రీధర్‌ బాబు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. వెంటనే రాజీనామా చేయాలని, బీజేపీ పాలిత ప్రాంతాలను చూసి సిగ్గు తెచ్చుకోవాలని అన్నారు. వెంటనే రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందించాలని, లేదంటే మంత్రి క్యాంపు ఆఫీస్‌ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.
అనంతరం విద్యుత్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు కొండపక సత్యప్రకాష్‌, మచ్చగిరి రాము, నియోజకవర్గ కో-కన్వీనర్‌ నంపెళ్లి రమేష్‌, మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్‌, సబ్బాని సంతోష్‌, కొయ్యడ సతీష్‌, పాగే రంజిత్‌, కొండ్రు లక్ష్మణ్‌, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు ఎల్కా సదానందం, సీనియర్‌ నాయకులు దుర్గం తిరుపతి,  బండం మల్లారెడ్డి, రాపర్తి సంతోష్‌, మట్ట శంకర్‌, మళ్లారపు అరుణ్‌, చిలువేరు సతీష్‌, విశ్వతేజ, సామల అశోక్‌, భానుప్రకాశ్‌, తొట్ల రాజు, రైతులు సాదుల రమేష్‌, జాన్నే శ్రీనివాస్‌, రాజు, ఓదెలు, వెంకటేష్‌, రామూర్తి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Bottom Ad [Post Page]