Full width home advertisement

Post Page Advertisement [Top]


హసన్‌పర్తి మహిళ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు

కర్ణాటకకు చెందిన నిందితుడి అరెస్టు

హన్మకొండ, సెప్టెంబర్ 12 (చక్రవాణి న్యూస్) :పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళను దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని హసన్‌పర్తి పోలీసులు ఛేదించారు. కొన్ని రోజుల క్రితం నమోదైన మహిళ అదృశ్యం కేసు.. చివరకు ఘోర హత్యగా తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్‌పర్తికి చెందిన తౌటం స్వప్న (40)కు కర్ణాటకలోని బళ్లారికి చెందిన వొద్దిరాజుల బసవరాజు (27)తో పరిచయం ఏర్పడింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బసవరాజు, తన వద్దకు రప్పించుకున్నాడు. అనంతరం ఆమెను పీకపిసికి హత్య చేసి, ఎవరికీ దొరకకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికి అడవిలో పడేసాడు.స్వప్న కనబడకుండా పోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు.. శుక్రవారం అంబాల–కమలాపూర్ రహదారిపై బసవరాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...

అన్యాయాన్ని అంతం చేసే

విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]