కాంగ్రెస్ గ్రామ కమిటీలకు కొత్త అధ్యక్షులు


 గ్రామ శాఖలకు సారథులుగా రాజయ్య, లింగస్వామి ఏకగ్రీవ ఎన్నిక

జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా గ్రామ కమిటీలు

మల్హర్, సెప్టెంబర్ 01 (చక్రవాణి న్యూస్) :

మండల కాంగ్రెస్‌లో గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. మండల పార్టీ అధ్యక్షులు జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం కొండంపేట, ఇప్పలపల్లె గ్రామ శాఖల అధ్యక్షుల ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.కొండంపేట గ్రామ శాఖ అధ్యక్షుడిగా శనిగరం రాజయ్య, ఇప్పలపల్లె గ్రామ శాఖ అధ్యక్షుడిగా అక్కినేని లింగస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు బడితెల రాజయ్య, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షురాలు, కొయ్యూరు సర్పంచ్ కొండ రాజమ్మ, సర్పంచ్ జోష్న సరీన్ రావుతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...

అన్యాయాన్ని అంతం చేసే

విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments