Full width home advertisement

Post Page Advertisement [Top]

 

          

        తెలంగాణ లో వేడెక్కిన రాజకీయాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 03 (చక్రవాణి న్యూస్) :

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన, సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి కొండా సురేఖను తక్షణమే తొలగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆమెను బర్తరఫ్ చేయాలని కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్‌కు అధికారిక సిఫార్సు లేఖను పంపింది. మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణతో పాటు పలు కీలక పదవుల్లో నియామకాలు, మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ప్రకటన విడుదల చేసింది.కొండా సురేఖను మంత్రి పదవి నుండి తక్షణమే తొలగిస్తూ గవర్నర్‌కు సిఫార్సు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసింది. ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నూతన ఉపాధ్యక్షురాలిగా నియమించారు.తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా శ్రీమతి నెరెళ్ల శారద నియామకానికి సీఎం ఆమోదం తెలిపారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధా రాణిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు



చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...

అన్యాయాన్ని అంతం చేసే

విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]