జీవో 97ను వెంటనే రద్దు చేయాలి
పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్
మలహర్, సెప్టెంబర్ 03 (చక్రవాణి న్యూస్) :
పాలిటెక్నిక్ కళాశాలల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97తో విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలయాపన కోసమే ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిందని ఆరోపించారు. విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటం ఆడటం సరికాదన్నారు. ఇంజనీరింగ్ కోర్సులను ఆధునీకరించాల్సింది పోయి డీగ్రేడ్ చేయడం తగదని పేర్కొన్నారు.
న్యూస్
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే
విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

