Full width home advertisement

Post Page Advertisement [Top]

నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించాలి
మల్హర్ , సెప్టెంబర్ 8 (చక్రవాణి న్యూస్) : వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మల్హర్‌రావు మండలంలోని ఆయా గ్రామాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందస్తు అనుమతులు తీసుకోవాలని కొయ్యూరు ఎస్‌ఐ మహేందర్ కుమార్ సూచించారు. పోలీస్ శాఖ నిర్దేశించిన పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా అనుమతి పొందడంతో పాటు విద్యుత్‌ శాఖ పర్మిషన్ కూడా తీసుకోవాలని తెలిపారు. రహదారులకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయరాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా మైకులు, డీజేలు వినియోగించవద్దని సూచించారు. ఉత్సవాలను నిబంధనలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ మహేందర్ కుమార్ తెలిపారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]