11 ఏళ్లుగా వెంట్రుకలు తిన్న యువతి.. పొట్టలో 1.16 కిలోల వెంట్రుకల ముద్ద!

 

ఢిల్లీలో వెలుగు చూసిన షాకింగ్ ఘటన.. శస్త్రచికిత్స చేసి వెంట్రుకల ముద్దను తొలగించిన వైద్యులు

హైదరాబాద్ సెప్టెంబర్ 03 (చక్రవాణి న్యూస్) :

ఢిల్లీలో ఓ 20 ఏళ్ల యువతి గత 11 ఏళ్లుగా వెంట్రుకలు తినే అలవాటుతో బాధపడుతోంది. తొమ్మిదేళ్ల వయసు నుంచే ఆమెకు ఈ అలవాటు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రవర్తనను వైద్య పరిభాషలో ‘ట్రైకోఫేజియా’ అంటారు.ఇటీవల యువతికి వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆమె పొట్టలో పెద్ద ముద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపీ ద్వారా పరిశీలించగా అది వెంట్రుకలతో ఏర్పడిన ముద్దగా తేలింది.శస్త్రచికిత్స చేసి బయటకు తీసిన ఆ ముద్ద 1.16 కిలోల బరువు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అన్నవాహిక, పొట్ట కలిసే ప్రాంతం నుంచి చిన్నపేగు వరకు ఈ వెంట్రుకల ముద్ద విస్తరించినట్లు తెలిపారు. ప్రస్తుతం యువతి చికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.

చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...

అన్యాయాన్ని అంతం చేసే

విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments