ఎస్‌ఐఆర్ పూర్తయిన వెంటనే ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం
హైదరాబాద్ , ఆగస్టు 27(చక్రవాణి న్యూస్) : తెలంగాణలో మరోసారి స్థానిక ఎన్నికల సందడి నెలకొనే అవకాశం కనిపిస్తోంది. రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలను ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెండో దశలో సైబరాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీల్లోనూ ఎన్నికల వేడి మొదలయ్యే అవకాశముంది.
ఇదే సమయంలో వివిధ కారణాలతో ఎన్నికలు వాయిదా పడిన అచ్చంపేట, మందమర్రి, మణుగూరు, నకిరేకల్, కొత్తూరు, సిద్ధిపేట ప్రాంతాల్లోనూ డిసెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించే యోచన ఉన్నట్లు సమాచారం.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటర్ల జాబితాలపై స్పష్టత రావడంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి చర్యలు వేగం పుంజుకునే అవకాశం ఉంది. అయితే ఎన్నికల తేదీలు, అధికారిక షెడ్యూల్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:


0 Comments