ఇప్పలపల్లిలో కాంగ్రెస్ నాయకులకు ఘన స్వాగతం


బడితల రాజయ్య, జంగిడి శ్రీనివాస్, కొండ రాజమ్మను సత్కరించిన గ్రామ ప్రజలు

మల్హర్ , ఆగస్టు 27 (చక్రవాణి న్యూస్) : ఇప్పలపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మల్హర్‌రావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి, ప్రజలకు సేవలందించిన బడితల రాజయ్యకు, నూతనంగా మల్హర్‌రావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన జంగిడి శ్రీనివాస్ ను, అలాగే మల్హర్‌రావు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా ఎన్నికైన కొండ రాజక్కకు ఇప్పలపల్లి సర్పంచ్ అబ్బినేని లింగస్వామి, ఉపసర్పంచ్ అక్కల దేవేందర్ యాదవ్, గ్రామ యువత, గ్రామ ప్రజలు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments