12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు.. ఫైళ్లు, రికార్డులు, ఆస్తులపై జల్లెడ
భూపాలపల్లి, ఆగస్టు 27(చక్రవాణి న్యూస్) :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనులు, భూగర్భ శాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు చేపట్టిన ఏకకాలిక సోదాలు జిల్లాలో సంచలనంగా మారాయి. జిల్లా సహాయ సంచాలకుడు బొజ్జ జయరాజ్‌పై వచ్చిన ఆరోపణల ఆధారంగా గురువారం ఉదయం నుంచి అధికారులు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
12 చోట్ల ఏకకాలంలో..
వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ బోడుప్పల్‌లోని జయరాజ్ నివాసంతో పాటు భూపాలపల్లి కలెక్టరేట్‌లోని మైన్స్ ఏడీ కార్యాలయంలో విస్తృతంగా సోదాలు కొనసాగాయి. సూర్యాపేట, తాండూరు తదితర ప్రాంతాల్లోని బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఫైళ్లు.. అనుమతులపై ఆరా
భూపాలపల్లితో పాటు ములుగు జిల్లాకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న జయరాజ్‌పై ఇసుక రవాణా వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతోపాటు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అనుమానాలున్నట్లు ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కార్యాలయంలోని ఫైళ్లు, అధికారిక రికార్డులు, అనుమతి పత్రాలు, ఇసుక రవాణాకు సంబంధించిన దస్త్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
నగదు, ఆస్తుల పత్రాలపై పరిశీలన
సోదాల్లో నగదు, బంగారం, భూముల రిజిస్ట్రేషన్ పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు లభించినట్లు సమాచారం. కార్యాలయంలోని ఓ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే సోదాలు పూర్తయిన అనంతరం లభించిన వాటిపై పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
అవార్డు అందుకున్న కొద్దిరోజుల్లోనే..
ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్న జయరాజ్‌పై ఏసీబీ సోదాలు జరగడం భూపాలపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సోదాలు, దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఆరోపణలకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:



0 Comments