250 గజాల ఇంటి స్థలం, రూ.25 వేల పెన్షన్, గుర్తింపు కార్డుల హామీలు అమలు చేయాలని ఉద్యమకారుల డిమాండ్
మల్హర్ , ఆగస్టు 24 (చక్రవాణి న్యూస్) :
హైదరాబాద్, ఆగస్టు 24 (చక్రవాణి న్యూస్): తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ప్రతినిధులు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకాలంలో ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలు చేసిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు 250 గజాల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వడం, నెలకు రూ.25 వేల పెన్షన్ అందించడం, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రస్తావించి, వారికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ అధిష్ఠానాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ప్రశ్నించి ఉద్యమకారులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేయాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉద్యమకారుల సమస్యలపై బలంగా మాట్లాడాలని, అసెంబ్లీ వెలుపల కూడా వారి న్యాయమైన హక్కుల కోసం పోరాడాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకాల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లూరి అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ క్రమశిక్షణ సభ్యుడు బోసుపెల్లి ప్రతాప్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (రిజిస్టర్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంతం యాది రెడ్డి, TUJC జనరల్ సెక్రటరీ మోత్కూరు మల్లేష్, TUJC ఆర్గనైజింగ్ సెక్రటరీ గంధం మల్ల యాదయ్య తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేసి, వారి త్యాగాలకు తగిన గౌరవం కల్పించాలని ఉద్యమకారుల ప్రతినిధులు డిమాండ్ చేశారు
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:


0 Comments