అక్షరాస్యతకు ఆహార భద్రత జోడించిన ప్రభుత్వం

694 ప్రభుత్వ పాఠశాలలు, 17 జూనియర్ కళాశాలలకు అల్పాహారం 

 మంథనిలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని , ఆగస్టు 24(చక్రవాణి న్యూస్) : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పేద విద్యార్థుల ఆకలి తీర్చడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, హరే కృష్ణ ట్రస్ట్ ప్రతినిధులు, పాండేషన్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌర చంద్రదాస స్వామీజీతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 19 మండలాల్లోని సుమారు 40 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బలవర్ధకమైన, పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని 694 ప్రభుత్వ పాఠశాలలు, 17 జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా అల్పాహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా అల్పాహారం అందించే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పేద విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణించగలరని, వారి మేధాశక్తి మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. అందుకే ప్రభుత్వం హరే కృష్ణ ట్రస్ట్‌తో కలిసి విద్యార్థులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. మొదట కొడంగల్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం మంథనికి విస్తరించామని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, మంథని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!

#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments