జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ రవి కుమార్
మల్హర్ , ఆగస్టు 15 (చక్రవాణి న్యూస్) :
మండల కేంద్రమైన తాడిచర్ల తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ కె. రవి కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కొయ్యూరు పోలీసు సిబ్బంది జెండాకు గౌరవ వందనం సమర్పించారుు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపీపీ మల్హర్ రావు, సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు ఇందారపు చంద్రయ్య, తిర్రి అశోక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కేసారపు చంద్రయ్య, పలువురు నాయకులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు


0 Comments