మువ్వన్నెల జెండాను ఎగురవేసిన చైర్మన్ ఇప్ప మొండయ్య
మల్హర్ , ఆగస్టు 15 (చక్రవాణి న్యూస్) :
మండల కేంద్రమైన తాడిచర్ల పీఏసీఎస్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ రవికుమార్, సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ , వార్డు సభ్యులు ఇందారపు చంద్రయ్య, తిర్రి అశోక్ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీఏసీఎస్ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


0 Comments