సెప్టెంబర్ 1లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి – వ్యవసాయ అధికారిణి బొల్లపెల్లి శ్రీజ
మల్హర్, ఆగస్టు 23 (చక్రవాణి న్యూస్) : వానకాలం–2026లో సన్న రకం వరి సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వం అందించే బోనస్ పొందాలంటే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిణి బొల్లపెల్లి శ్రీజ తెలిపారు.ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న రకం వరి సాగు చేస్తున్న రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్‌ను సంప్రదించి ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్, మొబైల్ నంబర్ వివరాలను సంబంధిత విత్తన డీలర్‌కు అందించాల్సి ఉంటుందని తెలిపారు.బోనస్ పొందేందుకు అర్హులైన రైతులందరూ ఎలాంటి జాప్యం చేయకుండా సెప్టెంబర్ 1వ తేదీలోపు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారిణి బొల్లపెల్లి శ్రీజ కోరారు.
న్యూస్
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే
విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"


0 Comments