తెలంగాణ రక్షణ సేనకు అంతర్జాతీయ విస్తరణ
14 దేశాలకు పార్టీ అధ్యక్షుల నియామకం
హైదరాబాద్, ఆగస్టు 23 (చక్రవాణి న్యూస్) : విదేశాల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే టీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిని కూడా నియమించారు.నూతనంగా నియమితులైన అధ్యక్షులు ఆయా దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలను ఏకం చేస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని పార్టీ చీఫ్ సూచించారు. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.
వివిధ దేశాలకు నియమించిన పార్టీ అధ్యక్షులు
ఆస్ట్రేలియా: కిషోర్ కత్తి
యూకే: సుమన్ రావు బాల్మూరి
కెనడా: వెంకట్రామణ్ మెట్పల్లి
ఇటలీ: తానింకి కిషోర్ యాదవ్
మాల్టా: పింటూ ఘోష్
పోర్చుగల్: ప్రకాష్ పొన్నకంటి
యూఏఈ: శేఖర్ గౌడ్ ఆరె
కువైట్: మార్క ప్రమోద్ గౌడ్
జింబాబ్వే: బెమ్మడి మహేందర్ రెడ్డి
ఖతార్: శేఖర్ చిలువూరి
ఫిన్లాండ్: సందీప్ రెడ్డి ఇరెడ్డి
నార్వే: ప్రసాద్ రావు బిక్కినేని
సౌదీ అరేబియా: మొజ్జం అలీ ఇఫ్తేకర్
ఐర్లాండ్: జయంత్ రెడ్డి మెట్టు
అదేవిధంగా టీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్‌ను నియమించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా తెలంగాణ బిడ్డలను ఒకే వేదికపై ఏకం చేస్తూ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నూతన అధ్యక్షులకు కల్వకుంట్ల కవిత సూచించారు. విదేశాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తరించి తెలంగాణ రక్షణ సేనను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

