మండల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్‌రావు
మల్హర్ , ఆగస్టు 28(చక్రవాణి న్యూస్) : మండల ప్రజలకు మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్‌రావు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలను మరింత బలోపేతం చేసే పవిత్రమైన పండుగ రక్షాబంధన్ అని పేర్కొన్నారు. మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందంగా రాఖీ పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:



0 Comments