రుద్రారంలో న్యూ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
లబ్ధిదారులకు కార్డులు అందజేసిన సర్పంచ్ చంద్రగిరి సంపత్
మల్హర్, ఆగస్టు 23 (చక్రవాణి న్యూస్): మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలో నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రారం గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్ లబ్ధిదారులకు నూతన రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బడితల రాజయ్య, వార్డు సభ్యులు చంద్రగిరి అశోక్, జాడి రాజశేఖర్, పీఏసీఎస్ డైరెక్టర్ సంగెం రమేష్, మోతుకూరి సంధ్యారాణి, మహేష్, కొమ్మెర విజయలక్ష్మి, స్వామి, చిట్యాల లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

