ఆధ్యాత్మిక ఉత్సాహంతో మురిసిన నాగులమ్మ క్షేత్రం

పుట్టల వద్ద పాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మహిళలు

మల్హర్ , ఆగస్టు 17-చక్రవాణి న్యూస్) : మల్హర్ మండల వ్యాప్తంగా నాగపంచమి శ్రావణమాస పర్వదిన వేడుకలు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగాయి. మండలంలోని కొయ్యూరు ప్రసిద్ధ శ్రీ కోయకుంట్ల నాగులమ్మ ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. నాగ దేవత ప్రతిమలు, పుట్టల వద్ద పాలు పోసి, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.అదేవిధంగా పెద్దతూండ్ల గ్రామ పరిధిలోని శ్రీ హనుమత్సహిత సుబ్రహ్మణ్యేశ్వర దత్తాత్రేయ వారాహీ ఆలయంలో సైతం నాగపంచమి పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై

సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

Post a Comment

0 Comments