మహిమల విగ్రహం పేరిట రూ. కోటికి మోసం: ముఠా అరెస్ట్

నిజం.. వైపు చక్రవాణి న్యూస్

హైదరాబాద్ , (చక్రవాణి న్యూస్) : అద్భుత శక్తులు ఉన్నాయంటూ నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని రూ. కోటికి విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాను రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఒక వ్యక్తి మొదట ఈ విగ్రహాన్ని రూ. 10 లక్షలకు కొని మోసపోయాడు. ఆ నష్టం పూడ్చుకోవడానికి, మరో ముఠాతో కలిసి దీనిని ఏకంగా రూ. కోటికి అమ్మేందుకు ప్లాన్ వేశాడు. కాటేదాన్ ప్రాంతంలో విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి నకిలీ విగ్రహాన్ని, ఒక పింక్ స్టోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

Post a Comment

0 Comments