ఆగస్టు 31 ఆఖరి తేదీ.. అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
మల్హర్ , ఆగస్టు 17(చక్రవాణి న్యూస్) :
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పెన్షన్ల కొరకు గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి కోరారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు మరియు హెచ్ఐవి, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు తమ దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.ఆగస్టు 31 లోపు ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నందున, చివరి నిమిషంలో సాంకేతిక లోపాలు రాకుండా ప్రజలు గడువు లోపే అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు. సమాచారం తెలియని అర్హులకు కూడా ఈ విషయాన్ని చేరవేసి దరఖాస్తు చేసుకునేలా సహకరించాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.


0 Comments