మల్హర్‌లో కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీలు

కేజీబీవీ, పీహెచ్‌సీ, తహసీల్దార్ కార్యాలయాల్లో పరిశీలన 

 నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

 భూసేకరణ, డేంజర్ జోన్ విచారణ వేగవంతం చేయాలని ఆదేశం

మల్హర్ , ఆగస్టు 18(చక్రవాణి న్యూస్) : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, పారదర్శక పాలన అందేలా అధికారులు పనిచేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మంగళవారం కాటారం ఆర్డీవో రవీందర్‌తో కలిసి మల్హర్ మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. దుబ్బగట్టు కేజీబీవీ, తాడిచర్ల పీహెచ్‌సీ, తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో విద్యార్థుల వసతులు, విద్యాబోధనను పరిశీలించి సూచనలు చేశారు. పీహెచ్‌సీలో వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, మందుల లభ్యతను తనిఖీ చేసి, పాము, తేలు కాటుకు అవసరమైన అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ, పెండింగ్ సమస్యలపై సమీక్షించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. తాడిచర్ల డేంజర్ జోన్‌పై విచారణను త్వరగా పూర్తి చేసి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

Post a Comment

0 Comments