అధికారులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశం
భూపాలపల్లి , ఆగస్టు 17(చక్రవాణి న్యూస్) :
మండల, జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను అధికారులు నిశితంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి (IDOC) కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 67 దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు సానుకూలంగా స్పందిస్తూ పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా చూసి, వాటి వివరాలను వెంటనే పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. వినతుల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఆర్వో వసంత కుమారి, ఆర్డిఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


0 Comments