గుడుంబా తయారీ మానుకోవాలి లేకుంటే కఠిన చర్యలు తప్పవు

కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్ హెచ్చరిక
మల్హర్, ఆగస్టు 21 (చక్రవాణి న్యూస్) : మండలంలోని అడువలపల్లి గ్రామానికి చెందిన నలుగురు గుడుంబా తయారీదారులను గుర్తించి, వారిపై లక్ష రూపాయల పూచీకత్తుతో మండల తాసిల్దార్ గారి ముందు బైండోవర్ చేసినట్లు కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ మహేందర్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా తయారీని పూర్తిగా మానుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బైండోవర్ అయిన వ్యక్తులు భవిష్యత్తులో మళ్లీ గుడుంబా తయారీకి పాల్పడితే చట్టపరమైన కేసు నమోదు చేయడంతో పాటు, లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న గుడుంబా తయారీదారులందరినీ పూర్తిస్థాయిలో గుర్తిస్తున్నామని, వారందరినీ త్వరలోనే తాసిల్దార్ ముందు బైండోవర్ చేస్తామని ఎస్ఐ తెలిపారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

Post a Comment

0 Comments