లబ్ధిదారులకు అండగా ప్రభుత్వం ఉంటుంది.. సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ
మల్హర్, ఆగస్టు 21(చక్రవాణి న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కొయ్యూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మల్హర్ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షురాలు, స్థానిక సర్పంచ్ కోండ రాజమ్మ ఆధ్వర్యంలో ఈ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ కోంఢ రాజమ్మ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో కొయ్యూరు గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సవేందర్, పంచాయతీ కార్యదర్శి పంచగిరి రాజు, వార్డు సభ్యులు వేల్పుల సరమ్మ, పంతకాని శశివర్ధన్, రేషన్ డీలర్ వేల్పుల నారాయణ, మహేందర్ రెడ్డి, తెప్పల రజిత, కొండూరి మమత, వేమునూరి రమ మరియు గ్రామ లబ్ధిదారులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

0 Comments