ఏసీబీ పక్కా స్కెచ్.. పట్టుబడిన కార్యదర్శి
మంచిర్యాల,ఆగస్టు 21(చక్రవాణి న్యూస్) :
ఇంటి నిర్మాణ అనుమతితో పాటు కొత్త ఇంటికి నంబరు కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి, ఏసీబీ పక్కా స్కెచ్‌తో బుక్కయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.వరలక్ష్మి ఒక బాధితుడి నుండి లంచం ఆశించారు. మొదట రూ.20 వేలు డిమాండ్ చేయగా, బేరసారాల అనంతరం రూ.13 వేలు తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు నిఘా పెట్టారు. కాగా, వరలక్ష్మి నేరుగా నగదు తీసుకోకుండా మరో పంచాయతీ కార్యదర్శి లావణ్యకు చెందిన 'ఫోన్‌పే' అకౌంట్‌కు డబ్బులు బదిలీ చేయాలని సూచించారు. ఆమె చెప్పినట్లే బాధితుడు డబ్బులు పంపగా, డిజిటల్ సాక్ష్యాలు మరియు లంచం డిమాండ్ చేసిన రికార్డులతో ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం ఆమెను కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.


0 Comments