Full width home advertisement

Post Page Advertisement [Top]

 ఎడ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మిరాజు

మల్హర్, (చక్రవాణి న్యూస్) :

ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్‌ను మల్హర్‌రావు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఎడ్లపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మిరాజు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబులు జంగిడి శ్రీనివాస్ సేవలను గుర్తించి సరైన పదవి అప్పగించారని కొనియాడారు. ఈ సందర్భంగా లక్ష్మిరాజు ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం చేశారు జంగిడి శ్రీ నివాస్ నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని లక్ష్మిరాజు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల రమేష్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు, సీనియర్ కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...

అన్యాయాన్ని అంతం చేసే

విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]