రసీదు లేకుండా ఎరువుల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు

 మండల వ్యవసాయ అధికారిణి బొల్లపెల్లి శ్రీజ 

అనుమతి ఉన్న గోదాముల్లోనే స్టాక్ నిల్వ ఉంచాలని ఆదేశాలు

మల్హర్ , ఆగస్టు 14 (చక్రవాణి న్యూస్) : రైతులకు విత్తనాలు, ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి బొల్లపెల్లి శ్రీజ హెచ్చరించారు. శుక్రవారం కొయ్యూరు రైతు వేదికలో డీలర్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 20 నుండి జిల్లాలో FFS సెంట్రల్ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అందుబాటులోకి రానుందని, ఇకపై అన్ని ఎరువుల విక్రయాలు ఈ యాప్ ద్వారానే జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ బోనస్ వర్తించాలంటే రైతులు కొన్న 7 రకాల వరి విత్తనాల వివరాలను వెంటనే ఆన్‌లైన్ చేయాలన్నారు.డీలర్లు తమ లైసెన్స్‌ను దుకాణంలో ప్రదర్శించాలని, అనుమతి ఉన్న గోదాముల్లోనే సరుకు నిల్వ చేయాలని స్పష్టం చేశారు. స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్కులను వ్యవసాయ అధికారితో సర్టిఫై చేయించాలని, రైతులకు రసీదు లేకుండా విక్రయాలు చేయవద్దన్నారు. ఎరువులు, విత్తనాలను లూజ్ గా అమ్మకుండా, కేవలం ప్యాకెట్ల రూపంలోనే ఈ-పోస్ మెషిన్ ద్వారా ఆధార్ వేలిముద్రతో విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారిని S. అనూష, డీలర్లు పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments