జంగిడి శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించిన గడ్డం క్రాంతి


యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

మల్హర్ , ఆగస్టు 20 (చక్రవాణి న్యూస్) : మల్హర్ రావు మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్‌ను గురువారం కొయ్యూరులో . మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, చిన్నతూండ్ల గ్రామ సర్పంచ్ గడ్డం  క్రాంతి రణదేవ్ ఆధ్వర్యంలో జంగిడి శ్రీనివాస్‌కు శాలువా కప్పి ఘన సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జంగిడి శ్రీనివాస్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన గడ్డం క్రాంతి, ఆయన నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొండంపేట సర్పంచ్ బెల్లంకొండ జ్యోత్స్న సరీన్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, రవి తదితరులు పాల్గొని నూతన మండల అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

Post a Comment

0 Comments