వీడియో, టెలికాన్ఫరెన్స్‌లలో చెప్పినా తీరు మారలేదు.. ఇక ఉపేక్షించేది లేదు!
హైదరాబాద్ , ఆగస్టు 10 (చక్రవాణి న్యూస్) :
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కొందరు అధికారుల తీరుపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సీవీ ఆనంద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శాఖలో ఉన్న నలుగురు ఉన్నతాధికారులు ఎంత చెప్పినా తమ పద్ధతిని మార్చుకోవడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. సదరు నలుగురు అధికారుల వైఖరిపై పలుమార్లు హెచ్చరించినట్లు పేర్కొన్నారు. "వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా ఆ అధికారులకు చాలాసార్లు పద్ధతి మార్చుకోవాలని స్పష్టంగా చెప్పి చూశాం. అయినా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు" అని డీజీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు.శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న ఆ నలుగురు అధికారులు ఇప్పటికైనా తమ పద్ధతిని మార్చుకోకపోతే, వారిపై తప్పకుండా కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా హెచ్చరించారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

0 Comments